క్రైమ్/లీగల్

న్యూడెమోక్రసీ సూర్యదళంపై పోలీసుల మెరుపు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లబెల్లి, ఫిబ్రవరి 28: న్యూడెమోక్రసీ సూర్యం దళంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం శివారు మురళినగర్ గ్రామంలో షెల్టర్ తీసుకుంటున్న న్యూడెమోక్రసీ సూర్యం దళంపై పోలీసులు దాడి చేసే ప్రయత్నంలో పోలీసుల రాకను పసిగట్టిన దళ సభ్యులు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నంలో దళ కమాండర్ సూర్యంతో పాటు దళ సభ్యుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పారిపోవడానికి ప్రయత్నించిన దళ కమాండర్ సూర్యంను పోలీసులు లొంగిపోవాలంటూ చెప్పిన అడవిలోకి పారిపోయాడని పోలీసులు చెప్తుండగా గ్రామ ప్రజలు మాత్రం సూర్యంను, దళ సభ్యుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. పోలీసుల బూట్ల చప్పుడు, గ్రేహౌండ్స్ బలగాల మోహరింపుతో మురిళినగర్ అట్టడిగి పోయింది, ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అదే విధంగా సూర్యం దళంకు సహకరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురిని ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో గ్రామస్తులు పోలీసులను బ్రతిమిలాడారు. నక్సలైట్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని తమ పిల్లలను వదలి వేయాలని నర్సంపేట ఏసీపీ సునితామోహన్, సీఐ దేవేందర్‌రెడ్డిని నల్లబెల్లి ఎస్సై నరేందర్‌రెడ్డి కాళ్ల మీద పడి వేడుకోగా గ్రామస్తులను పోలీసులు వదిలేశారు. ఇలాగే నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తే గ్రామంలో ఉన్న వారిపై కేసులు పెడుతామని పోలీసులు హెచ్చిరించారు. గత 15 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన దళ కమాండర్ సూర్యంను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు, పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.