క్రైమ్/లీగల్

సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 1: సిరిసిల్ల పట్టణంలో ఆర్థిక ఇబ్బందులతో పవర్‌లూం కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం స్థానిక బీవైనగర్ కార్మిక క్షేత్రంలో బొమ్మెన నారాయణ(60) అనే పవర్‌లూం కార్మికుడు ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణం పొందాడు. మృతుడు నారాయణ స్థానిక వెంకంపేటలో పవర్‌లూంలపై కాటన్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తాడు. ఇతడికి భార్య వసంత, కుమారుడు సాయి(24), నవ్య(21)లు ఉండగా, గత ఎనిమితి సంవత్సరాలుగా భార్య, పిల్లలతో దూరంగా ఉంటున్నాడు. తల్లి అమృతవ్వతో కలిసి జీవిస్తున్నాడు. అయితే మధ్యానికి బానిస అయిన నారాయణకు అప్పులు తోడయ్యాయి. కుటుంబం దూరంగా ఉండడంతో ఒంటరి జీవితం గడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంటిలో తల్లితో జీవిస్తున్నాడు. శుక్రవారం తల్లిని ఇంటి నుండి బయటకు పంపి, ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.