క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వాహనం బోల్తా పలువురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట్, మార్చి 1: నందిపేట, అయిలాపూర్ మార్గమధ్యలో మెయిన్‌రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం నిస్సాన్ టెరినో8081 నంబర్ గల వాహనం ప్రమాదవశాత్తు కల్వర్టుకు ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. అయిలాపూర్ శివారు ప్రాంతం నుండి మెయిన్‌రోడ్డు మీదుగా నందిపేట వైపుకు అతివేగంగా వస్తున్న నిస్సాన్ వాహనము చింరాజ్‌పల్లి సమీపంలో కల్వర్టును ఢీకొట్టి లోయలో బోల్తాపడింది. అందులో నాలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటన గమనించిన గ్రామ శివారు ప్రాంత ప్రజలు గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు అయిలాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించడంతో గ్రామ సర్పంచ్ దమ్మారెడ్డి సాయిరెడ్డి, బాధితుల కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడంతో వీరు కూడా నిజామాబాద్ తరలివెళ్లారు. ఈ విషయమై ఎస్సై రాఘవేందర్‌ను సంప్రదించగా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.
అదుపుతప్పి గరుడ బస్సును ఢీకొన్న కంటైనర్
తృటిలో తప్పిన పెనుప్రమాదం
సదాశివనగర్, మార్చి 1: మండలంలోని కుప్రియాల్ గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారిపై అదుపు ఓకంటైనర్ లారీ అదుపు తప్పి టీఆర్టీసి బస్సును ఢీకొన్న సంఘటన శుక్రవారం ఉదయం జరిగిందని ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న టీఆర్‌టీసీ బస్సు టీఎస్ 16 జెడ్ 0125 కుప్రియాల్ గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా, ముందు వెళ్తున్న కంటైనర్ లారీ హెచ్‌ఆర్ 15ఎన్ 6828ను డ్రైవర్ శివకుమార్ వర్మ అజాగ్రత్తగా, అతివేగంగా డివైడర్ మీదకు ఎక్కించి బస్తును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు తగలనప్పటీకీ పెద్ద పెను ప్రమాదం తప్పిందిన్నారు. అందరు ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. కంటైనర్ లారీని అజాగ్రత్తగా నడిపించిన డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బస్సు డ్రైవర్ బిక్యం జయరాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.