క్రైమ్/లీగల్

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే లభించే అరుదైన అటవీ సంపద ఎర్రచందనమని దీని అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్ మహ్మద్ ఇలియాస్ రిజ్వీ చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సమావేశానంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన దక్షిణ భారత రాష్ట్రాల సమన్వయ సమావేశంలో ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే నేడు మూడు రాష్ట్రాల అధికారుల సమన్వయ ప్రత్యేక సమావేశంలో చర్చించామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి అక్రమ రవాణాను విజయవంతంగా అరికట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ. 500 కోట్లు విడుదల చేసిందన్నారు. దీంతో ఇప్పటి వరకు కొరతగా ఉన్న సిబ్బంది నియామకాలు, వాహనాల కొనుగోలు, ఆయుధాలు, డ్రోన్లు, రాత్రి పూట వినియోగించే సీసీ కెమెరాలను సమకూర్చుకుంటామని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికడతామని స్పష్టం చేశారు. హోంశాఖ ప్రధాన కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ సీ ఎం చంద్రబాబు నాయుడు ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలన్న లక్ష్యంతో ఉన్నారని అన్నారు. మన రాష్ట్ర సంపద పరులపాలు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ ఏకే ఝూ, అదనపు సీఎఫ్ సీమగర్గ్, డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ అద్ల్లె ప్రసాద్, అదనపు డీజీపీ పి.రవీంథ్రనాథ్, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావులు పాల్గొన్నారు.