క్రైమ్/లీగల్

ధాన్యం లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతనూతలపాడు, మార్చి 1 : సంతనూతలపాడు పెట్రోల్ బంకు సమీపంలో నాగంబొట్లవారిపాలెం నుండి వరి ధాన్యంతో పేర్నమిట్టలోని సప్తగిరి రైస్‌మిల్లుకు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

నాటు తుపాకీ స్వాధీనం
* ఇద్దరు అరెస్ట్
మార్కాపురం, మార్చి 1: నాటు తుపాకీ కలిగివున్న ఇద్దరు వ్యక్తులను పెద్దారవీడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సాయంత్రం ఎస్‌డీపీవో కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్దారవీడు మండలంలోని నల్లమల అడవి సమీపంలోగల కలనూతల గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకీ కలిగివున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. నల్లబోతల లక్ష్మీనారాయణ, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించారు. తాము అడవి మృగాల నుంచి రక్షించుకునేందుకు సొంతంగా తయారుచేసుకున్న తుపాకీ అని నిందితులు తెలిపారు. అయినా మారణాయుధం కల్గివుండటం నేరం కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. విలేఖరుల సమావేశంలో సీఐ వై శ్రీ్ధర్‌రెడ్డి, పెద్దారవీడు ఎస్సై సీహెచ్ ప్రభాకరరావు పాల్గొన్నారు.

త్రుటిలో తప్పిన పెనుముప్పు
సంతనూతలపాడు, మార్చి 1 : ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ముప్పును తప్పించిన సంఘటన సంతనూతలపాడు సాగర్ కాలువ సమీపంలో జరిగింది. ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఒంగోలు నుండి చీమకుర్తి వైపు వెళుతున్న ఆటో, కొండెపి నుండి ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. తన ముందు ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో పరిస్థితిని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు తప్పించి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మీన, అర్చన అనే ఇద్దరు హిజ్రాలు, ఆటో డ్రైవర్ నాని, అజయ్ ఉన్నారు. వీరిలో అర్చనకు తీవ్ర గాయాలు కాగా మీన, నాని, అజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అతి వేగం వల్లే ప్రమాదం సంభవించింది. సంఘటన విషయం తెలుసుకున్న సంతనూతలపాడు ఎస్‌ఐ ఖాదర్ బాషా, చీమకుర్తి ఎస్‌ఐ జివి చౌదరి, డ్రైవింగ్ ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌లో క్షతగాత్రులను 108 ద్వారా ఒంగోలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని డిపో మేనేజర్ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు.