క్రైమ్/లీగల్

రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మార్చి 1 : రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది. గూడూరు - నెల్లూరు రైలు మార్గంలో 159-12 వద్ద రైల్వే ట్రాక్ పై శుక్రవారం తెల్లవారుజామున రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి పంచానామా చేయగా వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు గ్రామ పంచాయతీలోని గొట్లపాళెం గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్వర్లు (22)కు వెంకటాచలం మండలంలోని కసుమూరు గ్రామానికి చెందిన తన మేనత్తకుమారై కామాక్షితో గత 9 నెలల క్రితం వివాహమైంది. అయితే అదే కసుమూరు గ్రామానికి చెందిన మరో సమీప బంధువైన దొడ్డక ఈశ్వరయ్య కుమారై కామాక్షిమ్మ (17)తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈక్రమంలో గురువారం సాయంత్రం వెంకటేశ్వర్లు తన ఇంటి వద్ద నుంచి నెల్లూరుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చాడు. అయితే శుక్రవారం ఉదయం దొడ్డక కామాక్షి కుటుంబ సభ్యులు తమ కుమారై అదృశ్యమైందని వెంకటాచలం పోలిసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో రైల్వే కీ మెన్ రెండు మృతదేహలను గమనించి వెంకటాచలం రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. కంటేపల్లి రైల్వే గేటు సమీపంలో రెండు మృతదేహలు పడి ఉన్నాయనే సమాచారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియాటంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, దొడ్డక కామాక్షి కుటుంబ సభ్యులు సంఘటన స్ధలానికి చేరుకుని మృతి చెందింది వెంకటేశ్వర్లు, కామాక్షిననే నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాస రావు, వెంకటాచలం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి, శిక్షణ ఎస్‌ఐలు బాలుమహేంద్ర, కూచిపూడి స్వప్న ప్రియాలు సంఘటన స్ధలానికి చేరుకుని మృతదేహలను పరిశీలించారు. నెల్లూరు రైల్వే ఎస్‌ఐ దేవరాకొండ చిన్న వెంకయ్య తన సిబ్బందితో కలిసి సంఘటన స్ధలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. రైల్వే పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.