క్రైమ్/లీగల్

వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ బదిలీ నూతన ఎస్పీగా నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 1: వికారాబాద్ జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆమె స్థానంలో నూతన ఎస్పీగా ఎం.నారాయణను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీగా పని చేస్తున్న అన్నపూర్ణను విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి బదిలీ చేయగా, సీఐడీ ఎస్పీగా పని చేస్తున్న ఎం.నారాయణను వికారాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన ఎస్పీ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
మరొకరి పరీక్ష రాస్తున్న
విద్యార్థి పట్టివేత
సైదాబాద్, మార్చి1: ఇంటర్ పరీక్షల్లో హాల్‌టిక్కెట్‌లో మార్పులు చేసి మరొకరి పరీక్ష రాస్తున్న ఘటనలో ఇరువురిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంతోష్‌నగర్‌లోని స్టూడెంట్ పాయింట్ కోచింగ్ సెంటర్ విద్యార్థి రెయిన్‌బజార్‌కు చెందిన సయ్యద్ నరుూమ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను ఐఎస్ సదన్ గోకుల్ జూనియర్ కళాశాల కేంద్రంలో రాస్తున్నాడు. శుక్రవారం అతని ఇంగ్లీషు పరీక్షను హాల్ టిక్కెట్‌లో ఫొటో మార్చివేసి రెయిన్‌బజార్‌కు చెందిన మహ్మద్ సోహైల్ అతని స్థానంలో పరీక్ష రాస్తున్నాడు. అనుమానం వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ సుష్మాచౌహాన్ పట్టుకొని స్క్వాడ్‌కు అప్పగించారు. విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సయ్యద్ నరుూమ్, మహ్మద్ సోహైల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకరి పరీక్ష మరొకరు రాయడానికి వారి మధ్యవర్తిత్వం కుదిర్చిన కోచింగ్ సెంటర్ ఉద్యోగి ఖలీల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.