క్రైమ్/లీగల్

జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/గుడివాడ, మార్చి 22: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గుడివాడ జంట హత్య కేసులో ఇద్దరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన తర్వాత గుడివాడలోని అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితులకు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు మాత్రమే పూర్తయిందని, సమగ్ర దర్యాప్తు కోసం నిందితులను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకుంటామని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. గుడివాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన సాయి చౌదరి, అతని సతీమణి నాగమణి ఈ నెల 16వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. గతంలో గుడివాడ ధనియాలపేటలో నివాసం ఉండి గత రెండేళ్లుగా చెన్నైకు 300 కిలో మీటర్ల దూరంలో పెరంబులూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పాత నేరస్తుడు జిల్లెల సురేష్ (26) హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లిపోవటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఈ నెల 18వ తేదీన పెరంబులూర్ దగ్గర అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపర్చి పోలీసు రిమాండ్‌కు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణలో సురేష్ ఒక్కడే హత్య చేసినట్లు నిర్ధారణ కాగా అతనికి సహాయకుడిగా పెరంబులూర్ ప్రాంతానికి చెందిన సెల్వాదొరై అలియాస్ శివ (25)ను కూడా అరెస్టు చేశామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపారు.