క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, ఫిబ్రవరి 9: రెండు రోజుల కిందట అదృశ్యమైన ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని దిడిగి గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలో మేతరి మాణమ్మ(45) అనే మహిళ హత్యకు గురైంది. రెండు రోజుల కింద అనగా బుధవారం రోజువారిగా పొలానికి వెళ్లి అదృశ్యమైంది. మృతురాలు శుక్రవారం తన స్వంత చెరుకు తోటలోనే రక్తపు మడుగులో శవమై పడివుంది. మారణాయుధాలతో ఆమెపై బలంగా దాడిచేయడంతోనే మృతిచెందినట్లు మొహం, ఒంటిపై ఉన్న గాయాలను బట్టి స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా పోలంలోపనిచేస్తున్న సందర్భంలో దుండగులు ఆమెపై దాడికిదిగి చంపాలనే కసితోనే మారణాయుదాలతో తీవ్రంగా కొట్టినట్లు స్పష్టమవుతోంది. కాగా ఇంత దారుణం హత్యచేయుటకు గల కారణాలను పోలీసులు అణ్వేషిస్తున్నారు. క్లూస్, డాగ్‌స్క్వాడ్ బృందాలను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విచారణ పూర్తయితేగాని హంతకులెవరనేది స్పష్టంకాదంటున్నారు. సంఘటనా స్థలాన్ని సీఐ.సదానాగరాజు ఇతర పోలీసులు సందర్శించారు. మృతురాలికి ఒక కూతురుంది. ఆమెకు వావాహం జరిగింది. ప్రస్తుతం రెండవ భర్త రాజుతో సహజీవనం సాగిస్తోంది.