క్రైమ్/లీగల్

మావోయిస్టు మిలీషియా సభ్యుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, మార్చి 14: చర్ల మండలంలో గురువారం ఉదయం మావోయిస్టు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజువర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన తెలిపారు. చర్ల ఏఎస్సై, స్పెషల్‌పార్టీ, 141సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ సంయుక్తంగా ఆర్.కొత్తగూడెం, కుర్నపల్లి రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడన్నారు. అతన్ని పట్టుకునే క్రమంలో పారిపోయే ప్రయత్నం చేశాడని, వెంటనే పోలీసులు అప్రమత్తమై వెంబడించి పట్టుకున్నారని, విచారణలో మూడేళ్ల నుంచి అతను మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా నిమ్మలగూడెం గ్రామానికి పూనెం సారయ్యగా తెలిసిందని, ఇతని వద్ద నుంచి ఒక కాటన్‌బాక్స్, 28సెలైన్ బాటిల్స్ లభ్యమయ్యాయని తెలిపారు. ఇతన్ని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నామని ఎస్సై తెలిపారు.