క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్వో రాజేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగొండ, మార్చి 14: రైతు నుండి 5వేల లంచం తీసుకుంటూ వీఆర్వో రాజేంద్రం ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం ఖమ్మంలో చోటుచేసుకొంది. ఎసిబి అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగొండ మండలంలోని గంధసిరి ఇంచార్జ్ విఆర్వోగా పనిచేస్తున్న డేగల రాజేంద్రం అదే గ్రామానికి చెందిన రైతు చెమట నాగేశ్వరరావుకు పాస్‌బుక్కు ఇచ్చేందుకు పదివేలు డిమాండ్ చేశాడు. నాగేశ్వరరావుకు 4ఎకరాల 12గుంటల భూమి ఉన్నది, అందులో కొంతమేర పాస్‌బుక్ ఎక్కాల్సి ఉంది. అందుకు తనకు పదివేలు లంచం ఇస్తేనే పాస్‌బుక్‌లో ఎక్కిస్తానన్నాడు, డబ్బును ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌లో తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈవిషయంపై రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించగా వలపన్ని లంచం తీసుకుంటున్న విఆర్వోను అందుపులోకి తీసుకున్నారు. ఎసిబి డిఎస్పీ ప్రతాప్, సిఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్‌లు విచారణ చేసి రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.