క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఇన్‌కం ట్యాక్స్ అధికారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 14 : అనంతపురం నగరంలోని ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖరగౌడ్ గురువారం రూ. 25వేలు లంచం తీసుకుంటూ ఏసీ బీ అధికారులకు చిక్కాడు. వివరాలు.. తాడిపత్రి పట్టణానికి చెందిన ఆడిటర్ నిరంజన్‌బాబు తన క్లైంట్‌కు చెందిన ట్యాక్స్ రీఫండ్‌కు సంబంధించి ఫైల్ సమర్పించగా రూ. 2.09 లక్షలు రీఫండ్ చేయడానికి రూ. 25వేలు లంచం ఇవ్వాలని రాజశేఖరగౌ డ్ డిమాండ్ చేశాడు. దీంతో నిరంజన్‌బాబు విజయవాడకు చెందిన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం వల పన్ని ని రంజన్‌బాబు నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రాజశేఖర్‌గౌడ్‌ను పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.