క్రైమ్/లీగల్

వీవీ ప్యాట్లపై మీరేమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం మేర వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లతో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానులు రేకెత్తుతున్న పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో తప్పని సరిగా 50 శాతం మేరకు వీవీ ప్యాట్‌లను లెక్కించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. వీవీ పాట్యట్‌లను ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా ఈసీకి మార్గదర్శకాలు జారీ చేయాలని తెలుగుదేశం పార్టీతోసహా 21 పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజయ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం పిటిషన్ విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈసీకి నోటీసులు జారీ చేయడంతో పాటు, ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈవీఎంలపై అనుమానాలున్నాయని ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ గుర్తించిన నియోజక వర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్‌లలో మాత్రమే వీవీ ప్యాట్‌లో లెక్కిచడం సరైంది కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. వీవీ ప్యాట్ల్ ఏర్పాటు కేవలం అలంకార ప్రాయంకానే మిగిలిపోయేలా ఎన్నికల సంఘం చర్యలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్‌ర్ల తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. సుబ్రహ్మణ్యస్వామి వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విఘాతం కలిగించేలా ఈసీ చర్యలు ఉన్నాయని సింఘ్వీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది లక్షలకుపైగా పోలింగ్ బూత్‌లుంటే కేవలం ఎన్నికల సంఘం గుర్తించిన బూత్‌లలో మాత్రమే వీవీ ప్యాంట్ లెక్కించడం వల్ల ప్రయోజనాల తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా? లేదా అన్న సందేహాలను కూడా ఈసీ నివృత్తి చేయడం లేదని ఆయన తెలిపారు. ప్రతి లోక్‌సభ నియోజక వర్గం, అసెంబ్లీ సెగ్మంట్‌లో కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించే విధంగా ఈసీని ఆదేశించాలని ధర్మాసనాన్ని అభిషేక్ సింఘ్వీ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 25కు వాయిదా వేసింది. టీడీపీసహా 21 పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరుక్ అబ్దుల్లా ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికరమైన స్పందన లేకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.