క్రైమ్/లీగల్

సజ్జన్ పిటిషన్‌ను కొట్టివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: సిక్కుల అల్లర్ల కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని, సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. అంతేకాకుండా సజ్జన్‌కుమార్‌కు ఈ కేసులో బెయిల్ సైతం ఇవ్వరాదని, ఆయనకు విస్తృతమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో సజ్జన్‌కుమార్‌కు కనుక బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశాలు లేవని, బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీబీఐ తెలియజేసింది. దీంతో కేసును విచారిస్తున్న జస్టిస్‌లు ఎస్‌ఎ బోబ్డే, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని 1984లో ఆమె బాడీగార్డులే కాల్చి చంపడంతో చెలరేగిన అల్లర్లలో సిక్కులను ఊచకోత కోశారు. కాంగ్రెస్ నేతగా ఉన్న సజ్జన్‌కుమార్ ఢిల్లీ కంటోనె్మంట్ ప్రాంతంలోని రాజ్‌నగర్ పార్ట్-1 ప్రాంతంలో ఐదుగురు సిక్కులను హత్య చేశారని, పార్ట్-2 ప్రాంతంలో గురుద్వారను దహనం చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 17న అతనికి జీవితకాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బల్వన్ కౌఖర్, నేవీ అధికారి కెప్టెన్ భాగ్‌మల్, గిరిధరి లాల్, మాజీ ఎమ్మెల్యేలు మహేందర్ యాదవ్ కిషన్ ఖోఖర్‌లకు కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. శిక్ష పడ్డ అనంతరం ఆనెల 31న సజ్జన్‌కుమార్ కోర్టులో లొంగిపోయారు. తనకు జైలు శిక్ష పడిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి సైతం రాజీనామా చేశారు. అయితే తనకు విధించిన శిక్షను కొట్టివేయాలని, ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సజ్జన్‌కుమార్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం దీనిపై నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, సజ్జన్‌కుమార్ దాఖలు చేసిన కేసు డిస్మిస్, బెయిల్ పిటిషన్‌లను రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. కాగా దశాబ్దాల పాటు ఈ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు అన్యాయం చేసిందని, తమ పార్టీ నేతల ఆధ్వర్యంలోనే సిక్కుల ఊచకోత జరిగినందున తీవ్ర జాప్యం చేసిందని ఆరోపించిన బీజేపీ, ఆలస్యమైనప్పటికీ బాధితులకు న్యాయం చేసేలా తమ ప్రభుత్వం కృషి చేసిందని ఇటీవల ప్రకటించుకుంది.