క్రైమ్/లీగల్

మృతిపై అనుమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 15: వైకాపా నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చెబుతున్న విషయాలు, వాస్తవాలు పూర్త్భిన్నంగా ఉండడం అనుమానాలకు దారితీస్తోంది. వివేకానందరెడ్డి గురువారం రాత్రి 11 గంటలకు పులివెందులలోని తన స్వగృహానికి చేరుకుని డ్రైవర్ ప్రసాద్‌కు కారు ఇచ్చి పంపించేశారు. తెల్లవారుజామున ఫోన్ చేయగానే వచ్చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. రాత్రి నిద్రకు ఉపక్రమించిన వివేకా హత్యకు గురయ్యారు. బెడ్‌రూమ్‌లో పదునైన ఆయుధంతో నుదిటిపై రెండుసార్లు, తల వెనుకభాగం, ఎద, తొడపై బలంగా మోదిన లోతైన గాయాలున్నాయి. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బెడ్‌రూమ్‌లో నుంచి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి బాత్‌రూమ్‌లో వేసినట్లు ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారికి ఇట్టే అర్థవౌతోంది. బెడ్‌రూమ్‌లో రక్తపు మరకలుండటం ఈ ఆరోపణను బలపరుస్తోంది. ఇంటి వెనుకవైపు ఉన్న తలుపు తెరిచే ఉండడం మరిన్ని అనుమానాలతు తావిస్తోంది. హంతకులు ఇంట్లోకి ఎలా ప్రవేశించారన్నదే అంతుచిక్కన ప్రశ్నగా మిగిలింది. వివేకా రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన సమయం లో ఆయనతో పాటు ఇంట్లోకి ఎవరైనా వచ్చారా, ఆయనతో మాట్లాడినం త సేపు మాట్లాడి, హత్య చేసి వెనుక తలుపు గుండా వెళ్లిపోయారా అన్న అనుమానాలు లేకపోలేదు. శుక్రవారం తెల్లవారుజామున వివేకాకు తెలిసిన వ్యక్తులు తలుపుతట్టి పిలవగా, ఆయన తలుపు తీయగానే లోపలికి చేరుకుని గడియపెట్టి వివేకాను బెడ్‌రూమ్‌లో హతమార్చి బాత్‌రూమ్‌లో శవాన్ని పడవేసి వెనుకపైపు తలుపుగుండా వెళ్లిపోయి ఉంటారన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాగా వివేకాకు బాగా తెలిసిన వ్యక్తులే ఈపని చేసి ఉంటారన్న దానికి జరిగిన సంఘటన, అక్కడి ఆనవాళ్లు బలం చేకూరుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు వివేకా ఇంటికి చేరుకున్న పీఏ కృష్ణారెడ్డి, పని మనిషి ఎంతగా తలుపుతట్టినా తెరవలేదని చెబుతున్నారు. వెనుక వైపు కిటికీ వద్దకు వెళ్లి పిలిస్తే పలికే అవకాశం ఉందని, వెనుకవైపు వెళ్లగా ఆ తలుపు తెరిచివున్నట్లు గు ర్తించామని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ప్రకారమైతే, రాత్రి వివేకానందరెడ్డితో పాటు ఇంట్లోకి వచ్చినవారే హత్యచేసి ఉండాలి. పోలీసులకు ఫిర్యాదు చేయకముందే హత్య విషయం బయటకు పొక్కి, వివేకా అభిమానులు కొందరు ఇంటివద్దకు చేరుకుని ఇంట్లో అటుఇటు తిరగడం, వివేకానందరెడ్డి మృతదేహాన్ని తాకడం చేశా రు. ఫిర్యాదు తర్వాత మాత్రమే, పోలీసులు ఎవరినీ ఇంట్లోకి అనుమతించలేదు. ముందే అనేకమంది తిరిగినచోట నేరస్తుల ఫింగర్ ప్రింట్స్, ఫుట్‌ప్రింట్స్ ప్రత్యేకంగా క్లూస్ టీమ్‌కు ఎలా దొరికాయోనన్న అనుమానం కలుగుతోంది. ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మాత్రం నేరస్తుల ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ దొరికాయని మధ్యాహ్నం మీడియాతో చెప్పారు. వివేకా చేతిలో ఒక లేఖ ఉంటే వారి బంధువులు తీసుకుని పోలీసులకు అప్పగించారని ఎస్పీ సాయంత్రం ప్రకటించారు. డ్రైవర్‌ను తెల్లవారుజామునే రావాలని చెప్పినందుకు ఆయనే తనను నరికాడని వివేకా ఆ లేఖలో రాసినట్లు ఎస్పీ చెప్పడం నమ్మశక్యంగాని కథనంగా ఉంది. తనను పదునైన ఆయుధంతో నరికిన తర్వాత, వివేకానందరెడ్డి అలాంటి లేఖ రాసి చేతిలో పెట్టుకుని ఉంటారా, అంతవరకు ఆయన ప్రాణం నిలిచి ఉంటుందా అన్న ప్ర శ్న ఇక్కడ తలెత్తుతోంది. వివేకా ప్రాణం పోయిందని తెలిశాకే మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లి పడేసినట్లు కనిపిస్తోంది. మరి వివేకానందరెడ్డి లేఖ రాసి చేతిలో ఉంచుకోవడం ఆ విపత్కర సమయంలో సా ధ్యమా, ఎస్పీ బయటపెట్టిన లేఖ విషయం నమ్మశక్యం గాని కట్టుకథగానే ఉంది. వివేకాకు బాగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారన్నదానికి బలమైన ఆధారాలు ఎంతగా కనిపిస్తున్నాయో ఎస్పీ బయటపెట్టిన లేఖ అంత నమ్మశక్యంగాని అనుమానాలను రేకిత్తిస్తోంది. ఇక వైఎస్ జగన్ సందేహం వెలిబుచ్చినట్లుగా, ఈ హత్యపై నిజాయితీగా దర్యాప్తు కొనసాగుతుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. పోలీసుల దర్యాప్తుపై ఈ‘లేఖ ఉదంతం’ అనుమానం పుట్టిస్తుండగా, ఉదయమే వివేకా మృతదేహాన్ని చూడగానే అది హత్య అని స్పష్టంగా తెలుస్తుండగా దాన్ని గుండెపోటుగా ఎందుకు మీడియాకు విడుదల చేశారనే అనుమానం మరోవైపు ఉంది. వివేకా కుమార్తె సునీత హైదరాబాద్ నుంచి ఫోన్‌లో, ఫిర్యాదు చే యాలని చెప్పిన తర్వాతే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని బయటి ప్రపంచానికి తెలిసింది. తొలుత ఎందుకు దాచిపెట్టాలని ప్రయత్నించారన్నది మరో కోణం. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బయటపెట్టిన లేఖ ఉదం తం నమ్మశక్యంకాని కట్టుకథగా, అధికార పార్టీ నేతలపై అనుమానం కలిగిస్తుండగా, వివేకా హత్యను గుండెపోటుగా చెప్పి దాచాలని ప్రయత్నించిన ఉదంతం ఆయన బంధువులపై అనుమానం కలిగిస్తోంది.