క్రైమ్/లీగల్

అనర్హత వేటు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23:జంట పదవుల కేసులో ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట లభించింది. లాభదాయక పదవుల్లో ఉన్నారన్న ఆరోపణపై అనర్హత వేటుకు గురైన 20మంది సభ్యత్వాలనూ పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయడాన్ని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్నీ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దీనిపై మళ్లీ విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. కాగా, హైకోర్టు తీర్పును ఎన్నికల కమిషన్ సవాలు చేసే అవకాశం లేదంటూ కథనాలు వెలువడుతున్నాయి. 20మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఎంత మాత్రం చట్టసమ్మతం కాదని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, చందర్ శేఖర్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి స్పష్టం చేసింది. అలాగే ఈ ఎమ్మెల్లేనను అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయడాన్నీ దుయ్యబట్టింది. అనర్హులుగా ప్రకటించడానికి ముందు ఈ ఎమ్మెల్యేలకు తమ వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదని, ఆది సహజ న్యాయసూత్రాలకు
విరుద్ధమని తెలిపింది. కాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును శ్లాఘించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ‘న్యాయమే గెలిచింది’అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అన్యాయంగా వేటు వేశారని, హైకోర్టు తీర్పుతో ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు.

చిత్రం..అనర్హత వేటును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్న
ఆప్ ఎమ్మెల్యేలు మదన్‌లాల్ ఖుఫియా, శివ్‌చరణ్ గోయల్, విజేందర్ గార్గ్, శరద్‌కుమార్ చౌహాన్, అల్కా లాంబా తదితరులు