క్రైమ్/లీగల్

పిల్లర్ గుంతల్లో పడి ముగ్గురు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 16: ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతల్లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం నగరంలోని హమాలీకాలనీలో శనివారం జరిగింది. కాలనీకి చెందిన ముగ్గురు పిల్లలు రియాన్(3), ఆయాన్(6), రుద్రప్రసాద్(5) నీటి గుంతల్లో పడి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. హమాలీకాలనీలో ఇంటి నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తవ్వారు. ఆ గుంతల్లో నీరు చేరింది. కాలనీలో నివాసముంటున్న మహమ్మద్ పిల్లలు రియాన్, ఆయాన్, మహేష్ కుమారుడు రుద్రప్రసాద్ గుంతల సమీపంలో బండపై కూర్చుని ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ గుంతలో పడ్డారు. ఆడుకుంటున్న పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతగ్గా గుంతల్లో కనిపించడంతో బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.