క్రైమ్/లీగల్

జాప్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: లోకాయుక్తలను ఎందుకు నియమించలేదంటూ పనె్నండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సుప్రీం కోర్టు శుక్రవారం నిలదీసింది. ఈ జాప్యాని కి కారణాలను వివరించాలని న్యాయమూర్తులు రంజన్ గగోయ్, ఆర్ భానుమతిలతో కూడిన సుప్రీం కోర్టు బెం చ్ వారిని ప్రశ్నించింది. తమ రాష్ట్రంలో లోకాయుక్త స్థితిగతులను వివరించాలని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ కోరింది. జమ్మూకాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేవ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను లోకాయుక్త నియామక జాప్యానికి సంబంధించి సుప్రీం గట్టిగా నిలదీసింది. 2013నాటి లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని 63వ సెక్షన్ ప్రకారం ప్రతి రాష్ట్రం లోకాయుక్తను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తాజాగా వీటి ఏర్పాట్లపై జరిగిన జాప్యంపై దాఖలైన ప్రజాయుత పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. లోకాయుక్త ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయించాలని, అందుకు తగిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లనూ చేయాలని పిటీషనర్ కోరారు.