క్రైమ్/లీగల్

మనుషుల అక్రమ రవాణా కేసులో 18 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్(గచ్చిబౌలి), మార్చి 20: విజిటింగ్ వీసా మీద కువైట్‌కు ఉద్యోగాల పేరిట పంపిన రెండు ముఠాలకు చెందిన 18 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది, కానిస్టేబుల్‌తోపాటు 15మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 250 పాస్‌పోర్టులు నకిలీ వీసాలు, ఐదు లక్షల రూపాయల నగదు, 38 సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను పేర్కొన్నారు. శంషాబాద్‌లో ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌లో గడచిన 10 రోజుల్లో విజిటింగ్ వీసాలతో కువైట్‌కు అక్రమంగా మనుషులను పంపిస్తు మోసాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 14 కేసులు నమోదు కాగా 71 మందిని అరెస్టు చేయగా 21 మంది పరారీలో ఉన్నారు. మనుషుల అక్రమ రవాణాలో చేవెళ్లలో పోలీసుస్టేషన్ కానిస్టేబుల్, ఎయిర్‌పోర్టు సిబ్బందితో పాటు ఇద్దరు ముఠా నాయకులను, వారికి సహకరిస్తున్న 13 మందిని అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన తోట కంఠేశ్వర అలియాస్ మణికంఠ(28), పోతల సురేందర్ (27), మల్లేం నర్సింహా(23) అనుగోలు అనిల్ కుమార్(23), పగడాల యుగేందర్(23), లేబాకు వినయ్ కుమార్ (30), పసుపులేటి వెంకట సుబ్బారాయుడు(51)ను అరెస్టు చేశారు. ముఠాలో కంఠేశ్వర అలియాస్ మణికంఠ ప్రధాన సూత్రధారి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గడ్డం శశి అలియాస్ సత్య వెంకట పుష్పవతి (28), చింతల రామ్‌కుమార్ (26), షేక్ అక్రమ్(36), పిల్లి శ్రీకర్(33), ఆకారం బాలకృష్ణ (32), షేక్ ఖాదర్ బాషా(34), పుసపాటి రామకృష్ణ (36), ముక్కామల వెంకట విజయ భాస్కర్ రెడ్డి (42)ని అరెస్టు చేశారు. పుష్ప ఆధ్వర్యంలో ముఠా నడుస్తోంది. గల్ప్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న మహమ్మద్ ముజిబ్ ఖాన్(30), ఒమెన్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న అన్నపురెడ్డి రామలింగా రెడ్డి(35), చేవెళ్ల పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జీ.మధును అరెస్టు చేసినట్లు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలో ముఠాలు తిరుగుతూ కువైట్‌లో ఉద్యోగాల్పిస్తామని నకిలీ వీసాలతో పంపిస్తున్నారని చెప్పారు. చేవెళ్లలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మధు.. గతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పని చేశాడని తెలిపారు. నకిలీ వీసాలతో గల్ఫ్ దేశాలకు వెళ్తేవారికి పోలీసు వెరిఫికేషన్ సర్ట్ఫికెట్లను మధు ఇప్పిస్తునట్లు విచారణలో తెలిసిందని వివరించారు. మెడికల్ టెస్టులో అన్‌ఫిట్ ఉన్నవారిని శ్రీలంక తీసుకువెళ్లి అక్కడ ఆసుపత్రుల నుంచి నకిలీ ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లు తీసుకుని పంపిస్తున్నారని తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులకు సైతం అంతు చిక్కకుండా పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేస్తున్నారని తెలిపారు. ఎవరైన విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లాలనుకుంటే నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ముంబయి, గోవా, నెల్లూరు, చిత్తూరు, కడప, శ్రీలంక, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, చెన్నై, తమిళనాడు, హైదరాబాద్, కేరళ, మహారాష్ట్ర నుంచి ఈ తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. నిందితుల కోసం ఆయా ప్రాంతాల్లో సైబరాబాద్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, 100 మంది వరకు ఏజెంట్లు ఉన్న ట్లు గుర్తించిమని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారా వెళ్తే రూ.25 వేలకు మించి ఖర్చు కాదని, నకిలీ ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని వివరించారు. నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు ఫేక్ వీసాలు, రబ్బర్ స్టాం పులు, 38 సెల్‌ఫోన్లు, 160 పోలీసు వెరిఫికేషన్ సర్ట్ఫికెట్లు, ఆరు కంప్యూటర్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, రెండు ప్రింటర్లు, రూ.5లక్షల నగదును స్వాధీనం చేసకున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాపుచేసి నిందితులను పట్టుకున్న

చిత్రం..సైబరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న సీపీ సజ్జనార్