క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, మార్చి 23: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. కేశంపేట ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం మార్చి 19న కొత్తపేట గ్రామానికి చెందిన రాణి (32), భర్త రమేష్ ద్విచక్ర వాహనంపై రావిచేడ్ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాణి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్టు ఎస్‌ఐ వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయ.