క్రైమ్/లీగల్

చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం/తిరుపతి, మార్చి 21: చిత్తూరు జిల్లా సుటుపల్లి చెక్‌పోస్టు, తిరుపతి అర్బన్ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలంలోని సురుటుపల్లిలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ దగ్గర గురువారం సాయంత్రం రూ. 20లక్షల మూడువేల 900 రూపాయలు నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు ఎన్నికల నిఘా అధికారి కోమలేశ్వరి తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి సురుటుపల్లి చెక్‌పోస్ట్‌లో వాహనాలు తనిఖీచేస్తున్న సమయంలో టీఎన్ 18 ఎకె 5193 అనే మహేంద్ర వాహనాన్ని తనిఖీచేయగా, అందులో రూ. 15లక్షల మూడువేల ,900రూపాయలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అదేవిధంగా టీఎన్ 18 ఎఎస్ 9885 మహేంద్ర వాహనంలో రూ. 2,లక్షల 33వేలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఏపీ 03సీఎక్స్ 4138 అనే కారులో రూ. 1,54,900, మోటార్‌బైకులో రూ. 1లక్ష ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ నగదును సీజ్‌చేసి సత్యవేడు ఉప ఖజానాకు తరలించామన్నారు.
ఇదిలావుండగా తిరుపతి అర్బన్ జిల్లాలో రూ. 2.64లక్షలు నగదు, 1.350 కేజీల వెండి సీజ్ చేశామని అర్బన్ ఎస్‌పి అన్బురాజన్ చెప్పారు. నేలబేలు చెక్‌పోస్టు వద్ద తొట్టంబేడు పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న రూ. 55,350 విలువ చేసే 1.350 కేజీల వెండిని గుర్తించి సీజ్ చేశారు.