క్రైమ్/లీగల్

అనారోగ్యంతో ఉన్నా.. భారత్‌కు రాలేను: ఛోక్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని నిండాముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు కొత్త ఎత్తుగడ వేశాడు. గుండె సమస్య, తీవ్రమైన కాలునొప్పి, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి రుగ్మతలతో బాధపడుతున్నందున భారత్‌కు రాలేనని చెప్పుకొచ్చాడు. ఈమేరకు కోర్టులో శుక్రవారం ఛోక్సీ పిటిషన్ దాఖలు చేశాడు. పీఎన్‌బీ స్కామ్‌లోనే ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీని లండన్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నీరవ్‌కు ఛోక్సీ దగ్గర బంధువే. ఇద్దరూ కలిసే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ వేశారు. ఛోక్సీ అప్పగింతకు సంబంధించి ప్రక్రియ బుధవారం మొదలైనట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఛోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టులో మెహుల్ తరఫున విజయ్, అశుల్ అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్ 8కు వాయిదా వేశారు. కాగా ఛోక్సీ మెడికల్ రిపోర్డులు, సంబంధిత పత్రాలన్నీ కోర్టుకు అందజేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నందునే ప్రయాణం చేయలేడని న్యాయవాదులు పేర్కొన్నారు. అతడు ప్రయాణాలు చేయకూడదని వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ, ల్యాబ్, మందుల చీటీలు అన్ని కలిపి 30 పత్రాలు కోర్టుకు అందచేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఛోక్సీ ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పీఎన్‌బీని 13వేల కోట్ల రూపాయలకు ముంచేసిన నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశారు. నీరవ్ లండన్‌లో ఉన్నాడు. ఛోక్సీకి ఆంటిగ్వా, బార్‌బుడా దేశాల పౌరసత్వం ఉంది.