క్రైమ్/లీగల్

ఎస్‌బీఐలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 23: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకులో ఎవరూ లేని సమయంలో మంటలు ఎగసిపడడంతో భారీ ఆస్తినష్టం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సెలవు కావడంతో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో కొంతమంది సిబ్బంది మధ్యాహ్నం వరకు పనిచేసి తాళాలు వేసి వెళ్లారు. సుమారు 3 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా లోపలి నుంచి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో జనం భారీగా గుమిగూడారు. విషయం తెలుసుకున్న బ్రాంచి మేనేజర్ ప్రసాద్‌రెడ్డికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటల్లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ క్యాబిన్లు పూర్తిగా కాలిపోయాయి. సర్వర్లు, కంప్యూటర్లు బ్యాటరీలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. అయితే స్ట్రాంగ్ రూం, లాకర్లు, డబ్బులు నిలువ చేసే గదులు, రికార్డుల గదులకు మంటలు వ్యాపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం.. మంటల్లో తగులబడుతున్న ఆదోనిలోని ఎస్‌బీఐ కార్యాలయం