క్రైమ్/లీగల్

సీబీఐ విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐతో దర్యా ప్తు చేపట్టేల ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం శాఖకు ఆయన కుమార్తె డా. సునీతారెడ్డి విజ్ఞ ప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. అంతకుముందు సునీతారెడ్డి తన తండ్రి హత్యపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై రాజకీయ ఒత్తిళ్లు సరిగా జరగడం లేదని ఆమె అన్నారు. ఈ హత్యకు కారకులెవరో ని గ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చెయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉన్నందున, హైకోర్టు నిర్ణయం వచ్చేంతవరకూ వేచి చూడాలని త మకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించినట్టు చెప్పారు. ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని సునీతారెడ్డి ధ్వజమెత్తా రు. రాజకీయంగా తన తండ్రి హత్యను వాడుకొవాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.