క్రైమ్/లీగల్

అవమాన భారంతో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 23: అవమానభారాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని రాజబొల్లారం అనుబంధ గ్రామమైన అక్బర్జాపేట్‌కు చెందిన కోటగిరి శిరీష ఈనెల 20వ తేదీన తన స్నేహితురాలు సంగీతతో కలిసి సిద్ధిపేట్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామంలోని ఆసుపత్రికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఇరువురు తుర్కపల్లి గ్రామంలోని బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా శిరీష భర్త పద్మారావు వారి ఇంటి పక్కనేగల మాధవి అనే మహిళతో కలిసి కారులో వస్తున్న విషయాన్ని గమనించింది. వెంటనే కారును ఆపిన శీరిష కారులో మాధవి ఎందుకు ఉందని భర్త పద్మారావును నిలదీసి ప్రశ్నించింది. వెంటనే మాధవి కారులో నుండి దిగి వెళ్లిపోయింది. పద్మారావు తన భార్య శిరీష స్నేహితురాలు సంగీతలను అదే కారులో గ్రామ సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుట్ట సమీపంలో దింపి కొంచెం పనివుంది ఇప్పుడే వస్తానని మీరు ఇంటికి వెళ్లండని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన శీరిష భర్త పద్మారావుకు సెల్‌ఫోన్‌కు చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ సమీపంలో గ్రామస్థులు బహిర్బూమికి వెళ్లగా అక్కడ పద్మారావు చెట్టుకు తాడుతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. గ్రామస్థుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న శిరీష తన భర్త అవమానభారం తట్టుకోలేకనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.