క్రైమ్/లీగల్

జూబ్లీహిల్స్‌లో రూ.1.49కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 24: పార్లమెంట్ ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా ఉంటుందన్న అంచనాలకు బలం చేకూరుస్తూ జూబ్లీహిల్స్‌లో రూ.1.49 కోట్లు పట్టుబడ్డాయి. పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా వాహన తనఖీలను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో వీవీఐపీలు అధికంగా ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై రూ.1.49కోట్లను తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడిక్‌మెట్‌కు చెందిన గోపీనాథ్, రఘవేంద్ర.. హోండా యాక్టివా వాహనంపై డబ్బును తరలిస్తూ పట్టుబడ్డారు. విచారించగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తమకు అందించినట్టు మాత్రమే చెబుతున్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించమని కోరగా ఎలాంటి ఆధారాలు చూపలేదు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. ఎన్నికల కోసమే తరలిస్తున్నారా లేదంటే ఇతరులకు చెందిన డబ్బా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.