క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గనే్నరువరం, ఫిబ్రవరి 9: హనుమాజిపల్లి గ్రామానికి చెందిన వివాహిత లింగాల శైలజ (28) శుక్రవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామానికి చెందిన చాడ రాజిరెడ్డి తన కూతురును హనుమాసిపెల్లి గ్రామానికి చెందిన లింగాల నర్సింహారెడ్డి కుమారుడు లింగల సామిరెడ్డికి తన కూతురు శైలజను 8 సంవత్సరాల క్రితం ఇచ్చి పెళ్లి చేశాడని తెలిపారు. పెళ్లి సమయంలో ఆరు లక్షల రూపాయల నగదు, ఆరు తులాల బంగారం ఇచ్చారన్నారు. తన బిడ్డకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అత్త రాజవ్వ, మామ నర్సింహారెడ్డి వేదింపులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని, మృతురాలి తండ్రి చాడ రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు అదనపు వరకట్నపు వేదింపులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి.వంశీకృష్ణ తెలిపారు.