క్రైమ్/లీగల్

భారీగా బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్ , మార్చి 23 విమానంలోని సీటు కింద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఎయిరిండియా 952 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానాస్పదంగా గుర్తించిన అధికారులు అతడిని క్షుణంగా తనిఖీ చేశారు. అతడు తను దుబాయి నుంచి తీసుకువచ్చిన 1.22కేజీల బంగారాన్ని విమానంలో తాను కూర్చున్న సీటు కింద దాచి పెట్టిన్నట్లు కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానంలో తనిఖీలు చేసి సీటు కింద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చిన ఎయిరిండియా విమానం శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి దేశీయ సర్వీసుగా వెళుతుండడంతో మరో హైదరాబాద్ ప్రయాణికుడితో దానిని విశాఖపట్నం మీదుగా దిల్లీకి తరలించనున్నట్లు తెలిపాడు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.