క్రైమ్/లీగల్

వీవీప్యాట్ల పెంపుపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో వచ్చే నెలలో వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న జనరల్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో సెగ్మెంట్‌కు కేటాయించిన వీవీప్యాట్లను ఏమేరకు పెంచుతారో అన్న అంశంపై ఈనెల 28 తేదీలోగా స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన డివిజన్ బెంచ్ వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు సంఖ్య పెంపుపై ఈనెల 28 తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా తమకు వివరణ ఇవ్వాలని పోల్ ప్యానల్‌కు సూచించింది. ఎన్నికలు సాఫీగా, త్వరితగతిన జరిగేందుకు వీవీప్యాట్ల సంఖ్య పెంపుపై సరైన, సమగ్ర సమాచారం తెలపాలని బెంచ్ కోరింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వీవీప్యాట్‌తోనే ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే, వీవీప్యాట్ల స్లిప్పుల సంఖ్యను ఎందుకు పెంచలేకపోతున్నారని సుప్రీం బెంచ్ ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. వీవీ ప్యాట్ల స్లిప్పుల సంఖ్యను పెంచకపోవడానికి గల కారణాలను, అందుకు ఎదురయ్యే అవరోధాలను సవివరంగా తమ ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల 1కి వాయిదా వేసింది. ఇదిలావుండగా, ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే సమయంలో వీవీప్యాట్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరిగే ప్రక్రియను దేశంలోని మెజారిటీ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దాదాపు 21 మంది ప్రతిపక్ష నాయకులు సైతం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అయితే, ఎన్నికల కమిషన్‌ను ంచి సరైన స్పందన రాకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 50 శాతం మేరకు వీవీప్యాట్లలో లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.