క్రైమ్/లీగల్

న్యాయవాది గౌతమ్ ఖైతాన్, మరో ముగ్గురికి ఢిల్లీ కోర్టు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి న్యాయవాది గౌతమ్ ఖైతాన్, అతని భార్య రీతూతోపాటు విండ్‌సర్ హోల్డింగ్ గ్రూప్ లిమిటెడ్, ఇస్‌మాక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటుపై సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌తోపాటు నల్లధనం కలిగి ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేయడంతో న్యాయవాది గౌతమ్ ఖైతాన్ సహా మరో ముగ్గురికి ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ సమన్లు పంపింది. మేనెల 4న కేసు దాఖలైంది. అయితే, దీనిపై సదరు న్యాయవాది గౌతమ్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసి, అతనిని తీహార్ జైలుకు పంపింది. అతనిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డీపీ సింగ్, ఎన్.కే.మట్టా 12,500 పేజీల చార్జిషీటుతోపాటు అనెక్జర్లను కోర్టుకు సమర్పించారు. న్యాయవాది ఖైతాన్ ఆరు బ్యాంకు అకౌంట్ల ద్వారా 5,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో జమ అయినట్టు గుర్తించారు. ఇదిలావుండగా, ఖైతాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సైతం విచారణ చేపట్టింది.