క్రైమ్/లీగల్

రుణాల పేరుతో అమాయకులకు టోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పిస్తామంటూ అమయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న లోన్ కాల్ సెంటర్ నిర్వహకులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన ఒక ముఠా టీమ్ లీడర్లను, మేనేజర్‌లను ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పాడుతోంది. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు బంజారాహిల్స్, పంజాగుట్టలోని ఏలైట్ కనెక్ట్ కేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు సంబదించిన రెండు కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటుంన్న చెన్నైకి చెందిన రంగాస్వామి గోపి (27), హైదరాబాద్ నిజామ్‌పేట్‌కు చెందిన ఆశా కుమారి (38) ఇద్దరు మేనేర్‌లుగా ఉంటూ, మరో ఆరు మంది చందనగర్‌కు చెందిన జనుమ్‌పల్లి భూపాల్ రెడ్డి (22), సికింద్రాబాద్ ఖార్ఖానాకు చెందిన బేలోరి సాయి రామ్ (22), కర్మాన్‌ఘాట్‌కు చెందిన గోర్రె నరేష్ యాదవ్ (21), సోమాజిగూడకు చెందిన ఖాన్ (22), అమీర్‌పేట్‌కు చెందిన విజయలక్ష్మి (21), శంషాబాద్‌కు చెందిన రాచామల్ల ఆపూర్వ (25)లు టీమ్ లీడర్‌లుగా ఏలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నారు.
ఈ క్రమంలో టీమ్ మేనేజర్లు దాదాపు 60 మందిని టెలికాలర్స్‌గా నియమించి వ్యాపార లావాదేవీలు కోనసాగించింది. అమయకులను ఎంచుకుని వారికి మాయ మాటాలు చెప్పి తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పిస్తామని టెలికాలర్స్ మోసాలకు పాల్పడ్డారు. దాదాపు 600 మంది వినియాగదారులు నష్టపోయారని, వారి నుండి రూ.25 కోట్ల వరకు ఈ ముఠా సభ్యులు వసులు చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోన్ని ప్రైవేట్ బ్యాంకుల పేర్లు చెప్పి కేవలం 6.5 శాతం వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని వినియోగదారుడు నుండి ముందుగా ఆధార్, పాన్ కార్డు, డెబిట్ కార్డులు తీసుకుని వన్‌టైమ్ పాస్‌వర్డు సహయంతో సెక్యురిటీ డిపాజిట్ కింద రెండు నెలలకు సంబంధించిన ఈఏంఐని జమాచేయాలని సూచించి ప్రతి ఒక్కరి దగ్గర 32వేల రూపాయలు తస్కరించడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు 600 మంది భాదితుల నుండి సుమారు 25కోట్ల రూపాయాలు వసులు చేసి ఉండవచ్చని సీపీ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఓ బాధితులుడు రెండు రోజుల క్రితం నగరంలోని సీసీఎస్ పోలీసులను ఆశ్రాయించాడు. దీంతో నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) శిఖా గోయాల్ నేతృత్వంలో క్రైమ్ డీసీపీ ఆవినాష్ మహాంతి ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపాడు. బంజారాహిల్స్, పంజగుట్ట పోలీస్టేషన్ పరిధిలోని ఏలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు ఇద్దరు మేనేజర్‌లతో పాటు ఆరు మంది టీమ్ లీడర్లను అరెస్టు చేసిన్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఈ ముఠాలో మిగత 54 మందికి నోటీసులు పంపిన్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. నిందితుల నుండి 80వేలు నగదు, రెండు ల్యాప్‌టాప్స్, రౌటర్, 34 వైర్‌లేస్ టెలిఫోన్‌లు, 42 మోబైల్ ఫోన్స్, 21 సిమ్ కార్డులు, 60 లాంగ్ బుక్‌లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ ముఠాకు సంబంధించిన బ్యాంక్ ఆకౌంట్‌లను సీజ్ చేయడం జరిగిందని సీపీ పేర్కొన్నారు.
చిత్రం.. లోన్ కాల్ సెంటర్ వివరాలు వెల్లడిస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్