క్రైమ్/లీగల్

టేకు కలప లారీ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, మార్చి 23: లారీలో అక్రమంగా తరలిస్తున్న టేక కలపను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని బండారిగూడెం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పలిమెల మండలంలోని బండారిగూడెం మీదుగా లారీలో టేకు కలప అక్రమంగా రవాణ అవుతుందనే సమాచారం మేరకు మాటు వేసినట్లు తెలిపారు.
బండారిగూడెం వద్ద ఏపీ 07 ఎస్ 1655 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 62 టేకు కలప దుంగలు ఉన్నాయని చెప్పారు. లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడని అన్నారు. పట్టుకున్న టేకు కలప సుమారు పదిలక్షల పైచీలుకు ఉంటుందని తెలిపారు. లారీతో సహా కలపను మహదేవ్‌పూర్ కలప డిపోకు తరలించినట్లు వివరించారు. లెంకలగడ్డ, ముకునూరు బేస్ క్యాంప్ నుండి కలప రవాణా అవుతుందని వెల్లడించారు.