క్రైమ్/లీగల్

సైదాబాద్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, మార్చి 26: రెండు వాహనాలు డీకొన్న ప్రమాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి సద్దుమణిగింది. సోమవారం అర్ధరాత్రి 12గంటలకు సైదాబాద్‌లో ఒక ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని జాకీర్‌హుస్సేన్ కాలనీ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న మరో వర్గానికి చెందిన యువకుని వాహనాన్ని ఢీకొట్టింది. ఇరువురి మధ్య తలెత్తిన వివాదానికి అక్కడే ఉన్న వారి వర్గాలు వత్తాసుకు దిగారు. ఒకరిపై మరో వర్గం రాళ్లురువ్వుకున్నారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి అదనపు పోలీసుబలగాలు రప్పించారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సైదాబాద్‌లో పర్యటించారు. యాక్సిడెంట్‌తో వివాదానికి కారకులైన ఆరీఫ్, ఆమీర్, ఖలీల్, వెంకట్ రావు సత్యమ్మపై కేసులు నమోదు చేశారు.