క్రైమ్/లీగల్

గ్రామ రెవెన్యూ అధికారికి సంవత్సరం జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), మార్చి 23: రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేపడుతూనే అవినీతికి పాల్పడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ రెవెన్యూ అధికారి రాజయ్యకు సంవత్సరం జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు శుక్రవారం తీర్పు చెప్పారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన వయ్యాల పుష్పలత తన తల్లి గారి గ్రామమైన ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో 20 సంవత్సరాల క్రితం 28 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి స్వాధీనం చేసుకుంది. సంఘటనకు నాలుగు నెలల క్రితం పుష్పలత తాను కొనుగోలు చేసిన భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేసి పాస్ బుక్కులు ఇప్పించాలని విఆర్‌ఓ జంగపల్లి రాజయ్యను ఆశ్రయించింది. రాజయ్య చాలాన్ కట్టాలని వెయ్యి రూపాయలు తీసుకొని రెండు నెలల అనంతరం కలవాలని పంపించేశాడు. కొద్ది రోజుల అనంతరం తన వద్ద ఉన్న పాస్ పుస్తకాలను, తన బంధువైన తిరుపతితో కలిసి రాజయ్యకు ఇవ్వగా 15 రోజుల తదుపరి ఐదు వేల రూపాయలు లంచం ఇస్తేనే పాస్ బుక్‌లు ఇస్తామని డిమాండ్ చేయగా, అంత డబ్ము ఇవ్వలేనని, నాలుగు వేలు రూపాయలైనా ఇవ్వాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఆయా రూపాయలను ఇవ్వలేని పుష్పలత ఎసీబి అధికారులను 29 జనవరి, 2011న సంప్రదించింది. ఎసీబి అధికారుల సూచన మేరకు ధర్మారంలోని రాజయ్య ఇంటిలో పుష్పలత నాలుగు వేల రూపాయలు ఇస్తుండగా అక్కడే వేచి ఉన్న అధికారులు వలపన్ని రాజయ్యను పట్టుకొని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి సాక్షులను ప్రవేశపెట్టారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితుడైన గ్రామ రెవెన్యూ అధికారి జంగపల్లి దేవయ్యపై నేరం రుజువు కావడంతో సంవత్సరం జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కాగా, ప్రస్తుతం వెల్గటూరు మండలంలోని అంబారిపేటలో జంగపల్లి రాజయ్య గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.