క్రైమ్/లీగల్

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 28: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఈ సినిమా ప్రదర్శించకూడదని ఆదేశించింది. ఏప్రిల్ 3న సాయంత్రం 4 గంటలకు న్యాయమూర్తి చాంబర్‌లో ఈ సినిమా ప్రదర్శించాలని ఆదేశించింది. సినిమా చూశాక తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని, ఈ చిత్ర ప్రదర్శనకు చిత్ర నిర్మాత కూడా హాజరు కావాలని ఆదేశించింది.
కాగా, ఈ చిత్రాన్ని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ విడుదల చేయరాదని మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు గురువారం ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు పైవిధంగా స్పందించింది. ఈ చిత్రం విడుదల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బ తింటాయని, ఏప్రిల్ 15 వరకూ చిత్రం విడుదల నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. ఏప్రిల్ 15 వరకూ చిత్ర ప్రదర్శనను, శాటిలైట్ లేదా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయవద్దంటూ తాత్కాలిక ఇంజక్షన్‌ను కోర్టు మంజూరు చేసింది.