క్రైమ్/లీగల్

వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 28: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివేకా హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో ఎర్ర గంగిరెడ్డి, ప్రకాష్, కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేమన్నారు. సంఘటనాస్థలంలో లభించిన సాక్ష్యాలు, బంధువుల తెలిపిన వివరాలను బట్టి హత్యగా భావించి ఆ కోణంలో విచారణ చేపట్టామన్నారు. వివేకా పడకగదిలో రక్తపు మరకలను తుడిచివేయడం, శవాన్ని సంఘటనా స్థలం నుంచి తరలించడంలో ఎర్ర గంగిరెడ్డి, ప్రకాష్, లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వకుండా దాచిన వివేకా పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు.