క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర ఘరానా దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 28: మహారాష్టత్రో పాటు తెలంగాణ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన అంతర్ రాష్ట్ర ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి 20లక్షల విలువ చేసే 62 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను వివరించారు. మహారాష్టల్రోని యావత్‌మాల్ జిల్లా బాబుల్‌గాన్ తాలూక వాకేడ్‌కు చేందిన అమూల్ అశోక్ మీర్జాపూరి(30) కొంత కాలం హోంగార్డుగా పని చేసి మానేశాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం నాగపూర్‌లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేయడంతో 2014లో పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పూరి సిద్దహస్తుడు. 2014లో నాగపూర్ పోలీసులు 18కేసుల్లో నిందితుడైన పూరిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. జైలు నుంచి విడుదలైన తరువాత మీర్జాపూరి.. దృష్టిని తెలంగాణ వైపు సారించాడు. రైలులో నగరానికి వచ్చి పగలు తాళం వేసిన ఇళ్లను రెక్కి చేసి రాత్రిళ్లు తాళాలు పగలగొట్టి ఉన్నదంతా దొచుకుపోతాడు. దొంగతనం చేసిన సొత్తు విక్రయించగా వచ్చిన డబ్బుతో మట్కా, పేకాట ఆడి జల్సాలు చేస్తాడు. డబ్బులు అయిపోతే రైలెక్కి నగరానికి వచ్చి రెండు మూడు ఇళ్లల్లో దొంగతనం చేసుకుని వెళ్లిపోతాడని సీపీ వివరించారు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడని, కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో దొరికి సీసీ పూటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ట్రై కమిషనరేట్‌తో పాటు వరంగల్, సంగారెడ్డి, పలు జిల్లాల్లో దొంగతనాలు చేసినట్లు సీపీ చెప్పారు. సైబరాబాద్ పరిధిలోని కేపీహెచ్‌బీలో నాలుగు, మియాపూర్‌లో ఒకటి, రాచకొండ మెడిపల్లిలో ఒకటి, హైదరాబాద్ పరిధిలో ఐదు, వరంగల్‌లో మూడు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒక కేసులో మీర్జా నిందితుడని పేర్కొన్నారు. 15కేసుల్లో కేజీ బంగారం వరకు నిందితుడు దొంగతనం చేయగా 62 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. మరో మారు నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన కేపీహెచ్‌బీ, మియాపూర్ పోలీసులతో పాటు ఎస్‌ఓటీ పోలీసులను అభినందించడంతో పాటు క్యాష్ రివార్డులు సీపీ అందించారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్ రావు, కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మినారాయణ, డీఐ సైదులు, మియాపూర్ డీఐ మహేష్ గౌడ్, ఎస్‌ఐలు హరిశంకర్, ఎస్‌ఓటీ ఎస్‌ఐ విజయ్ పాల్గొన్నారు.