క్రైమ్/లీగల్

నకిలీ పత్తివిత్తనాలు విక్రయస్తున్న ఏజెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 23: నకిలీ విత్తనాలను విక్రయిస్తూ అమాయక రైతులను మోసగిస్తూ సులభతరంగా డబ్బు సంపాదిస్తున్న నిందితుడిని సిరిసిల్ల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాల ఏజెంట్ కోట శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, అతడి నుండి రూ.2.60,000 విలువ గల 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్గె సమక్షంలో ప్రధాన నిందితుడు కోట శ్రీనివాస్‌ను, అతడి వద్ద స్వాదీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాలతో సహ హాజరు పర్చారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందగా, ఇతడు కరీంనగర్‌లో విత్తనాల కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ఇతడు మెదక్ జిల్లా తూఫ్రాన్‌లోని పత్తి విత్తనాల ప్లాంట్‌లో పని చేశాడు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీనివాస్ నకిలీ పత్తి విత్తనాల కోసం ఏజెంటుగా పని చేస్తూ పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలలోని రైతులకు ఎలాంటి లైసెన్సు లేకున్నా, లైసెన్సు ఉన్నట్టుగా చెప్పుకుంటూ రైతులకు విక్రయిస్తున్నాడు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని మోసం చేస్తున్నాడు. గత సంవత్సరం ఈ ఉదంతంలో శ్రీనివాస్ పెద్దపల్లి, చెన్నూర్ పోలీస్ స్టేషన్లలో అరెస్టు అయ్యాడు. ఇది ఇలా ఉండగా సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం గురువారం రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సిరిసిల్ల బైపాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని మూడు ప్లాస్టిక్ సంచులతో పాటు పట్టుకుని అతడిని ప్రశ్నించారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం తను హైదరాబాద్‌లోని అక్షర కాటన్ విత్తనాల ప్లాంటుకు చెందిన ప్రవీణ్ వద్ద నుంచి 150 కిలోల నకిలీ పత్తి గింజలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్లాస్టిక్ సంచుల్లో 100 కిలోల విడి పత్తి విత్తనాలు, 99 పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. సీడ్ ప్యాకెట్లపై పల్లవి విత్తనాల కంపెనీ పేరుతో లేబల్స్ ముద్రించి ఉన్నాయి. అరెస్టు అయిన వ్యక్తి మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన వ్యక్తి కాగా, ఇతడు ప్రస్తుతం కరీంనగర్ రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ సంఘటలో శ్రీనివాస్‌పై సిరిసిల్ల పోలీసులు 120-బి, 420, 487, 488 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్గె మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలను ఎలాంటి లైసెన్సు లేకుండా రైతులకు దుకాణాల యజమానులు విక్రయించరాదని, అలాంటి కార్యక్రమాలు గుర్తించినట్టయితే, పోలీసులకు తెలియచేయాలని కోరారు. అలాగే నకిలీ విత్తనాలు అమ్మేవారిపై చట్టపరంగా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.