క్రైమ్/లీగల్

యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ హైదరాబాద్, మార్చి 29: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కేసీఆర్ సర్కార్ తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. టీపీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం ఇక్కడ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేసీఆర్ నివసిస్తున్న ప్రభుత్వ వసతి సదుపాయం ప్రగతి భవన్‌ను ఆఫీసు కమ్ రెసిడెన్స్‌గా ఉపయోగించుకుంటున్నానర్నారు. అనేక సందర్భాల్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారన్నారు. విశ్రాంతి గృహాలు, డాక్ బంగ్లాలు, ఇతర ప్రభుత్వ వసతి సదుపాయాలను ఏకపక్షంగా సొంతానికి ఉపయోగించుకోరాదని ఎన్నికల నిబంధన చెబుతోందన్నారు. భూమి రికార్డుల్లో తప్పులు ఎడాది క్రితమే దొర్లాయన్నారు. ఈ తప్పులు దాదాపు 2.5 లక్షలు ఉన్నాయన్నారు. రైతులతో మాట్లాడి వెంటనే కలెక్టర్ మీకు ధృవపత్రం, రైతు బంధు కింద సొమ్ము చెల్లిస్తారని కేసీఆర్ హామీ ఇవ్వడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్లేనన్నారు. ఈ సమస్య పరిష్కారమైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో వెంటనే ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు. నిజామాబాద్ ఎన్నికలను ఏదో విధంగా వాయిదావేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టాలని ఆయన కోరారు. నల్లగొండ ఎన్నికల్లో దాదాపు 480 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నియోజకవర్గం ఎన్నికలను వాయిదా వేస్తారనే ఆందోళనతో ప్రజలు ఉన్నారన్నారు. నిజామాబాద్‌లో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనేక చోట్ల జాతీయ నాయకులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు ముసుగులు వేశారన్నారు. వీరు దేశం కోసం త్యాగం చేసిన వారనే విషయాన్ని మర్చిపోయి అనుచితంగా ప్రవర్తించడం తగదన్నారు. కేసీఆర్ జీవితంపై నిర్మించిన ఉద్యమ సింహం బయోపిక్ విడుదలైంనదన్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఆయన అన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు చిత్తశుద్ధిగా, పారదర్శకంగా విధులు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.