క్రైమ్/లీగల్

ప్రస్తుత విధానమే అత్యంత అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ప్రస్తుతం అనుసరిస్తున్న వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించే పద్ధతి అత్యంత అనుకూలమయిందని ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాండమ్‌గా ఒక్కో పోలింగ్ కేంద్రానికి చెందిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తున్న ప్రస్తుత విధానం సరయిందని ఎన్నికల సంఘం సమర్థించుకుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాండమ్‌గా కేవలం ఒకే పోలింగ్ కేంద్రం నుంచి కాకుండా ఎక్కువ పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్‌లను లెక్కించాలనే వాదనపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు మార్చి 25వ తేదీన ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడాన్ని మరింత మెరుగుపరచడానికి అనుసరించ వలసిన విధానాలపై వచ్చే సలహాలను భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికలలో పరిశీలిస్తానని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 3త్వరలో జరుగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు ఎన్నికల సంఘం ఇదివరకే పరిశీలించిన, అధ్యయనం చేసిన, నిర్ణయం తీసుకున్న
అంశాలే. త్వరలో జరుగబోయే ఎన్నికలలో అనుసరించ వలసిన విధానానికి సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానే్న అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది2 అని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21 మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని ఈ తరుణంలో మార్చడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని ఎన్నికల సంఘం తెలిపింది. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కనీసం 50 శాతం ఓటింగ్ మెషిన్లలోని వీవీప్యాట్‌లను రాండమ్‌గా లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ 21 మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా ఎన్నికల సంఘం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.