క్రైమ్/లీగల్

ఎన్నికల ‘మద్యం’పై ఆంధ్రా, ఒడిశా జాయింట్ ఆపరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 29: ఎన్నికల నిర్వహణ కోసం కొంతమంది అక్రమ మద్యాన్ని ఏవోబీలో నిల్వ చేసి, అక్కడ నుంచి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు సరఫరా చేసే ముఠాలను అదుపుచేసేందుకు ఈ రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 72 గ్రామాల్లో నాటుసారా, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణా స్థావరాలపై దాడులు చేసేందుకు వ్యూహం ఖరారైందన్నారు. ఈ ఆపరేషన్ ఇరుగుపొరుగు రాష్ట్రాలు కలిపి నిర్వహిస్తాయని, అవసరమైతే ప్రత్యేక ప్రాటున్లు బృందాల సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటామన్నారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా మద్యం విచ్చలవిడి అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ, ఓటరును ప్రలోభపెట్టే మద్యాన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసి మద్యం లిఫ్టింగ్ రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో సరఫరాను నియంత్రించేందుకు తమ విభాగం పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం గత మార్చి నెలతో పోల్చితే సరఫరా 2.5శాతం తక్కువగానే ఉందన్నారు. జిల్లా పరిధిలో సీజ్ చేసిన మద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వాహణ సక్రమంగా ఉండాలంటూ ఎసీ సుకేష్, ఈఎస్ ఆదినారాయణ, డిపోమేనేజర్ కుమారస్వామిలను హెచ్చరించారు. ఇప్పటి వరకూ రూ. 17 కోట్లు విలువ చేసే అక్రమ మద్యాన్ని సీజ్ చేసామని తెలిపారు. రాష్టమ్రంతటా 4,500 కేసులు నమోదు చేసామని వివరించారు. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో నాటుసారా ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధునాతన సాంకేతిక సహాయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి సవరణలు చేయకుండా గత ఏడాది మాదిరిగానే షెడ్యూల్ మేరకే లైసెన్స్‌దారులకు మద్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఒడిషా రాష్ట్రానికి చెందిన నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా జిల్లాలో అధికంగా అమ్మకాలు సాగేందుకు అవకాశం ఉందని, అందుకే ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల అబ్కారీశాఖ జాయింట్ ఆపరేషన్ ద్వారా అటువంటి నిల్వలపై దాడులు చేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. మద్యం అక్రమ నిల్వలపైన, బెల్టుషాపులు నిర్వాహణపైన, లైసెన్స్‌దారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న అంశాలపై స్పష్టమైన ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు.
ఐదు లక్షల అక్రమసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీ కేంద్రాలను 35 నుంచి 65 కేంద్రాలకు పెంచామని పేర్కొన్నారు. ఒక వ్యక్తివద్ద ఆరు సీసాలకు మించి మద్యం నిల్వలు ఉంటే కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పును అబ్కారీశాఖ తు.చ.తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించామని, సోమవారం అనంతరపురం జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈయనతోపాటు డీసీలు శ్రీనివాసరావు, బాబ్జీరావు, ఎసీ భాస్కరరావు, ఈఎస్‌లు దాస్, సుబ్బారావు, ప్రసాద్, శంభుప్రసాద్, ఆదినారాయణమూర్తి, డిపో మేనేజర్ కుమార స్వామి ఉన్నారు.