క్రైమ్/లీగల్

ఇంటి అద్దె అడిగితే కత్తి పోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 29: ఇంటి అద్దె అడిగాడని యజమానిపై కత్తితో యువకుడు దాడి చేసి హత్యయత్నానికి పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హసన్‌నగర్‌లో నివసిస్తున్న అబ్దుల్ రషీద్ నివసిస్తున్నాడు. అబ్దుల్ రషీద్ తన నివాసంలో తజాముల్‌కు ఓ పోర్షన్‌ను అద్దెకు ఇచ్చాడు. తజాముల్‌ను అద్దె ఇవ్వాలని అబ్ధుల్ రషీద్ అడగడంతో కోపోద్రిక్తుడైన దాడి చేశాడు. కత్తితో అబ్ధుల్ కడుపులో రెండు పోట్లు పొడిచాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అబ్దుల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.