క్రైమ్/లీగల్

‘న్యాయ్’ సొమ్ముతో భరణం చెల్లిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్:ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో అమలు అయ్యేవెన్ని..కాలగర్భంలో కలిసిపోయేవెన్నో తెలియక పోయినా..వీటిని ఓటర్లు మాత్రం గట్టిగా నమ్ముతున్నారని చెప్పడానికి ఉదాహరణలెన్నో..! ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలే కాదు..ప్రాంతీయ పార్టీలు ఇబ్బడి ముబ్బడిగానే వాగ్దానాలు గుప్పిస్తున్నాయి. అలాంటి వాటిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించిన కనీస ఆదాయ పథకం. తాము అధికారంలోకి వస్తే పేదలకు సాలీనా 72వేల రూపాయలు అందిస్తామని, వాటి బ్యాంకు ఖాతాల్లోనే ఆ మొత్తాన్ని జమచేస్తామని ఆయన చెప్పారు. ఇది బాగా ప్రచారంలోకీ వచ్చింది. ఇందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఏమీ కావాలి! కేంద్రంలో రాహుల్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఖాతాలో ఏటా 72వేల జమ అవుతుందని, ఆ మొత్తం నుంచే తనకు దూరంగా ఉంటున్న భార్య, కుమార్తెకు భరణం చెల్లిస్తానని ఓ టెలివిజన్ నటుడు కుటుంబ వ్యవహారాల కోర్టులో స్పష్టం చేశాడు! విడాకుల కేసు పెండింగ్‌లో ఉండటంతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. దీనితో వీరి ఖర్చుల నిమిత్తం నెలకు 4500 రూపాయలు చెల్లించాలని ఆనంద్ శర్మ అనే ఈ వ్యక్తిని ఈ నెల 12న కుటుంబ కోర్టు ఆదేశించింది. అయితే తాను టెలివిజన్‌లో చిన్నచిన్న పాత్రలే వేస్తున్నానని, వాటి ద్వారా నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుందని ఆయన కోర్టుకు నివేదించాడు. పైగా తన తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని చెప్పిన ఆనంద్ శర్మ ‘మీరు ఆదేశించినట్టుగా నా భార్య, కుమార్తెకు నెలకు నాలుగున్నర వేలు చెల్లించలేను. అందుకే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ ఈ తీర్పు అమలును వాయిదా వేయండి’అని కోర్టును అభ్యర్థించాడు. తనకు వచ్చే ఆరు వేల రూపాయల్లో నాలుగున్నర వేల రూపాయల మొత్తాన్ని తన భార్య బ్యాంకు ఖాతాలోకి జమచేస్తానని కోర్టు సాక్షిగా ప్రమాణం చేశాడు కూడా. కాగా, ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి కోర్టు వాయిదా వేసింది.