క్రైమ్/లీగల్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 30: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ కథనం ప్రకారం... పట్టణంలో నివాసం ఉంటున్న గన్నవరపు వీరాంజనేయులు(47) మేడ్చల్‌లోని యూఎస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. వీరాంజనేయులు శనివారం ఉదయం వేళ తన విధులకు కాలినడకన వెళ్తుండగా అత్వెల్లి మసీదు సమీపంలో జాతీయ రహదారి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని మేడ్చల్ మార్చురీకి తరలించి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ తెలిపారు.

బాచుపల్లిలో గుట్కా స్వాధీనం
జీడిమెట్ల, మార్చి 30: బాచుపల్లిలో నిషేధిత గుట్కాను మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి గ్రామం, సాయినగర్‌కు చెందిన షేక్ రఫీక్, సిరాజ్ ఓ ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం నుంచి టాటా సుమో వాహనంలో పెద్దమొత్తం నిషేధిత గుట్కాను తీసుకువచ్చి నగరంలో సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు బాచుపల్లి చౌరస్తాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సీఐ పురుషోత్తం, ఎస్సై విజయ్ కుమార్, హెచ్ కానిస్టేబుల్ శివ, గణేశ్, ఖలీల్ పాల్గొన్నారు.