క్రైమ్/లీగల్

నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: అనుమతి లేని నకిలీ పత్తివిత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీటీ-2 (బీజీ-2) పత్తి విత్తనాలపేరుతో హెచ్‌టీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంచిర్యాలలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ఒక దుకాణంపై చేసిన దాడిలో 33 క్వింటాళ్ల హెచ్‌టీ పత్తివిత్తనాల సంచులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి 13 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ను కూడా ఉపయోగిస్తామన్నారు. నకిలీ పత్తివిత్తనాలు, హెచ్‌టీ పత్తివిత్తనాల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోందని, పర్యావరణం దెబ్బతింటుందని, పశువులకు నష్టం జరుగుతుందని వివరించారు. వారం రోజుల క్రితమే తాను ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశానని గుర్తు చేశారు. ఇక నుండి అన్ని జిల్లాల్లో అధికారులు రైతులతో సమన్వయంతో పనిచేయాలని, అనుమతిలేని పత్తివ్తినాలు కొనుగోలు చేయకుండా రైతులను ఆపాలని సూచించారు. నకిలీ పత్తివిత్తనాలు, అనుమతి లేని పత్తివిత్తనాల స్టాకులు ఉన దుకాణాలపై టాస్ట్ఫోర్స్ రైడింగ్‌లను భారీ ఎత్తున కొనసాగించాలని ఆదేశించారు.

చిత్రం.. అధికారులు స్వాధీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాల సంచులు