క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్‌కు పట్టుబడిన రూ.1.36కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 2: నగరంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కోటి 36లక్షల నగదును పట్టుకున్నారు. ఏవిధమైన లెక్కలు లేని అక్రమ సొమ్ముగా తేల్చారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోందని, అదేవిధంగా ఎన్నికల సమయం కావడంతో పట్టుబడిన సొమ్ము వెనుక రాజకీయ కోణం కూడా ఉందేమో అన్న అనుమానాలూ లేకపోలేదని నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. దీనికి సంబంధించి ఇంకా దొరకాల్సిన నిందితులతోపాటు, నగదు కూడా రికవరీ చేయాల్సి ఉందన్నారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అభినవరెడ్డి విదేశాలకు మిర్చి ఎగుమతి వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు అవసరం నిమిత్తం తనకు తెలిసిన వ్యక్తుల నుంచి సేకరించేందుకు తన వద్ద ఉద్యోగి అయిన నాగరాజును మార్చి 17వ తేదీన నగరానికి పంపాడు. నాగరాజు ఓ హోటల్‌లో ఉంటూ నగరంలోని పలువురి వద్ద నుంచి డబ్బు సమకూర్చుకుంటున్నాడు. ఈక్రమంలో మార్చి 22వ తేదీ సాయంత్రం నాగరాజు, అతనికి సహాయకుడు హర్షవర్ధన్‌లను కొంతమంది వ్యక్తులు టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి జక్కంపూడి శివారుకు తీసుకెళ్లి కొట్టి రూ.1.7కోట్లు నగదు దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం అనుమానాస్పదంగా ఉండటంతో సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందం దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేల్చారు. ఈ కేసులో నిందితులైన విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన వాసుపల్లి నాగరాజు (29), వాసుపల్లి దాసు (32), రాజమండ్రి లాలాచెరువుకు చెందిన రెడ్డిపల్లి కిషోర్ అలియాస్ నాని (28), కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన పరికెల భవానీ శంకర్ (22), చిట్లూరి సాయి హర్షవర్ధన్ (22) మరో 17ఏళ్ళ బాలుడిని అరెస్టు చేశారు. వాసుపల్లి నాగరాజు గత మూడేళ్ళు నుంచి విశాఖకు చెందిన అభినవరెడ్డి అనే వ్యాపారి వద్ద పని చేస్తున్నాడు. మిర్చి వ్యాపారంలో భాగంగా విజయవాడ వచ్చి పలువురి వద్ద నుంచి సేకరించిన సొమ్ముతో మార్చి 22వ తేదీన రెడ్డిపల్లి కిషోర్ అలియాస్ నానితో కలిసి తాము బస చేసిన హోటల్ మనోరమ వద్దకు వస్తుండగా పథకం ప్రకారం వచ్చి అడ్డగించిన హర్షవర్ధన్, భవానీశంకర్‌లు తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి అతని వద్ద ఉన్న నగదు బ్యాగుతో సహా వీరిని జక్కంపూడి వద్దకు తీసుకెళ్లి కొట్టి మళ్లీ అక్కడి నుంచి హోటల్ రూముకు వచ్చి గదిలో ఉన్న మరో రెండు బ్యాగుల్లోని నగదు కూడా తీసుకుని వెళ్లిపోయారు. అయితే హోటల్ రూములో ఉన్న మరికొంత నగదు నిందితుల పేరుతో నాగరాజు, నానిలు కూడా నొక్కేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో నిగ్గు తేల్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు కంగు తిని నాగరాజు, వాసులతో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి కోటి 36లక్షలు నగదు రివకరీ చేశారు. కాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు రవీంద్ర పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు సీపీ చెప్పారు. అయితే మిర్చి వ్యాపారం పేరుతో ఇంత పెద్ద మొత్తంలో సేకరించిన సొమ్ము హవాలా డబ్బు అయి ఉంటుందని, లేదా ఎన్నికల నేపధ్యంలో డబ్బు సమకూర్చుకోవడమా అనే భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో డీసీపీలు వెంకట అప్పలనాయుడు, బి రాజకుమారి, ఏడీసీపీ నవాబ్ జానీ, టాస్క్ఫోర్స్ ఏసీపీ సూర్యచంద్రరావు, సిఐ సత్యానందం, తదితరులు పాల్గొన్నారు.