క్రైమ్/లీగల్

రూ.72 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఏప్రిల్ 3: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ , పోలీసుసిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి రూ.72 లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డిఎస్‌పి యు నాగరాజు తెలిపారు. 2వ పట్టణ పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రసాద్‌నగర్‌లోని డెబ్రో గరల్స్‌హోమ్ సమీపంలో నివాసం ఉంటున్న డాక్టర్ బోరుగడ్డ రవితేజ నుండి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనాథపిల్లల గృహంలో ఒక గదిలో రవితేజ నివాసం ఉంటున్నాడని తెలిపారు. కొన్ని రోజులక్రితం కోటి రూపాయలు కంకట వెంకట శివప్రసాద్ తన అనుచరులతో వచ్చి రవితేజకు అందజేయగా విడతలవారీగా డబ్బులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన రూ.72.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈడబ్బు కట్టలపై కడప ఎస్‌బిఐ, కరూర్ వైశ్యాబ్యాంక్‌ల ముద్రలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. డబ్బు ఎక్కడనుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చిందీ అనే విషయంపై లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ, శివప్రసాద్ లను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు.