క్రైమ్/లీగల్

పసుపుకుంకుమకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపుకుంకుమకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటితోపాటు అన్నదాత, వృద్ధాప్య ఫించన్ల పథకాలకు కూడా పచ్చ జెండా పూపింది. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ముందు నుండే ఈ పథకాలు అమలవుతున్నందున, ఎన్నికల దృష్ట్యా వీటికి సంబంధించిన నగదును పంపిణీ చేసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు పథకాలకు సంబంధించిన నగదు బదిలీని నిలిపివేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ జనచైతన్య తరపున వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు లక్ష్మణ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసి పుచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అముల చేస్తున్న పసుపుకుంకుమ పథకాన్ని అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిపివేయాలని, ఇందుకు సంబంధించిన నిధుల పంపిణీని నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్నందున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని జన చైతన్య తరపు లాయరు వాదించారు. కాగా, పసుపుకుంకుమ పథకం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభమైనందున ఈ పథకం కింద నిధుల పంపిణీకి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది వాదించారు. పాత పథకాలకు కావటం వలన నగదు పంపిణీని నిలిపివేయవలసిన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాన్ని కమిషన్ లాయరు కోర్టు దృష్టికి తెచ్చారు.