క్రైమ్/లీగల్

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏజేఎల్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్ భవనాన్ని ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏజేఎల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎల్‌అండ్‌డీఓ)కు నోటీసు కూడా జారీ చేసింది. ఢిల్లీ నగరంలోని ఐటీఓ ప్రాంతంలో గల హెరాల్డ్ హౌజ్‌ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించకుండా సంయమనం పాటించేలా ఆదేశించాలని కోరుతూ ఏజేఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏజేఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీకి మెజారిటీ వాటాలు ఉన్న యంగ్ ఇండియన్ (వైఐ) కంపెనీకి షేర్ల బదిలీ ప్రక్రియ మొత్తం కూడా కంపెనీకి చెందిన లాభదాయకత కోసం రహస్యంగా, అక్రమంగా జరిగిందని హైకోర్టు పేర్కొంది. 56 ఏళ్ల లీజు పూర్తి కావడంతో పాటు ఆ భవనంలో ముద్రణ, ప్రచురణ కార్యకలాపాలు సాగడం లేదని, కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భవనాన్ని వినియోగిస్తున్నందున ఆ భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 30న జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని కూడా ఏజేఎల్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.