క్రైమ్/లీగల్

మద్యం సేవించి వాహనం నడిపిన 114 మందికి జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు 114 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. మరికొందరికి డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరుగురికి 10 రోజులు, ఇద్దరికి 7, ముగ్గురికి 6, 13 మందికి 5, 9 మందికి 4, 35 మందికి 3, 46 మందికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. 57 మంది లైసెన్సులను సస్పెండ్ చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించినందుకు గాను బ్రీతింగ్ అనలైజర్ పరీక్ష ద్వారా వెల్లడి కావడంతో వారికి ఈ శిక్ష విధించినట్లు తెలిపారు.